TG: కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఢిల్లీలో ఇవాళ భేటీ కానుంది. ఈ సందర్భంగా సీతారామ ఎత్తిపోతల పథకం అనుమతులపై చర్చించనుంది. ఈ ప్రాజెక్టు DPRను టెక్నికల్ కమిటీ పరిశీలించనుంది. ఈ సమావేశంలో తెలంగాణ ENC, గోదావరి అంతర్రాష్ట్ర విభాగం అధికారి పాల్గొంటారు. మరోవైపు హైదరాబాద్ జలసౌధలో నిపుణుల కమిటీ సమావేశం జరగనుంది. డేంజర్ జోన్లో సహాయక చర్యలపై చర్చించనుంది.