ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు బాలురు షేక్ ఇస్మాయిల్, కె.సాల బిల్వనాధ్, అప్పాడి పాఠశాల నుంచి బయటకొచ్చారు. వారు దారి తప్పిపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పాఠశాల యాజమాన్యం వెంటనే రెండోపట్టణ పోలీసులకు సమాచారమిచ్చింది. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో సీఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో రంగంలోకి దిగి పిల్లలను గుర్తించి తెచ్చారు.