తెలుగు రాష్ట్రలో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మొండికేస్తున్నాయి. సోమ, మంగళవారాలు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ (Department of Meteorology)హెచ్చరించింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయి. ఫలితంగా జూన్(June)లో సగం రోజులు గడిచిపోయినా ఎండలు సుర్రుమంటున్నాయి. భానుడు రెచ్చిపోయి నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
మరో రెండు మూడు రోజుల్లో వాటిలో కదలిక కనిపించే అవకాశం ఉందని తెలిపింది .రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత (Intensity of the sun) ఎక్కువ ఉంటుందని, వడగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చారిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమల్లో(Rayalaseema)ని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 25 నాటికి వాయవ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా(Odisha) మీదుగా పయనించే అవకాశం ఉందని, అప్పుడు ఉత్తర కోస్తాకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు