NLR: బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు చేజర్ల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి విజయ లలిత ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ నెల21వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
సత్యసాయి: మిర్చి రైతుల సమస్యలపై దమ్ముంటే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్ విసిరారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మిర్చి రైతులకు మేలు జరిగిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు జగన్ హాజరుకావాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: పామూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా గంగసాని హుస్సేన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరక వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్ రెడ్డి సతీమణి గంగసాని లక్ష్మి పామూరు ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల హుస్సేన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల ద్వారా 193చెరువులు, 2రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపాలని మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. గురువారం సచివాలయంలో మంత్రిని కలిసిన ఆయన, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని తెలిపారు. వీటి పెంపుదల కోసం తగిన నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
W.G: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడితే వరి చేలలో ఎలుకలు పూర్తిగా నివారించుకోవచ్చని మొగల్తూరు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రహీం అన్నారు. గురువారం ఆయన మొగల్తూరు గ్రామంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రైతులు సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరి రైతులు పాల్గొన్నారు. అనంతరం వరి పంట సస్యరక్షణపై అవగాహన కల్పించారు.
SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గురువారం ఆయన ఆయన కార్యాలయంలో ఐదు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ప్రకాశం: గిద్దలూరులో గురువారం పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయించాలని ప్రజాసంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ నివాసాలు భూములు కోల్పోతున్న ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
W.G: ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఈవో రంగరాజు అన్నారు. గురువారం యలమంచిలి మండలంలోని కొంతేరు హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25వరకు జరిగే ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
CTR: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని టీడీపీ నాయకులు సి.వి.రెడ్డి, గిరిబాబు ఆకాంక్షించారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 74 మందికి విద్యార్థినులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
CTR: బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా, కార్యక్రమానికి ఆదితోపాటు మరో నటుడు రాంప్రసాద్ సైతం రానున్నారు.
TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు అందిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడ్డారు. చిన్నారుల తల్లి, తండ్రులు తక్షణమే తమ పిల్లలను స్వయంగా మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.