NLR: జిల్లా గ్రామ పంచాయతీలు చెత్త నుంచి ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాన్ని ఆకస్మికంగా ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉందో పరిశీలించారు. రోజువారి చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని సూచించాడు.
NLR: ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీ పరిధిలోని బిజ్జంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి బదిలీపై వెళ్తున్న J. కృష్ణయ్యను తోటి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఐదేళ్ల నుంచి గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో HM J. మాధవ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
BPT: పేదల కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేత వంగవీటి మోహనరంగా పేదల పెన్నిధిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల పట్టణంలోని బీమావారి పాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి కోన రఘుపతి వైసీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
PLD: గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు , వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పల్నాడు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ATP: అనంతపురం జిల్లా కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని, అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వరాజ్యం కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి అని కొనియాడారు.
VZM: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరై అల్లూరి సీతారామ రాజు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
GNTR: బహిరంగ ప్రదేశాల్లో కొబ్బరి బోండాలు వేయవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో సమావేశమై ఆయన మాట్లాడారు. కొందరు వాడేసిన కొబ్బరి బోండాలను రోడ్ల వెంబడి, పంట కాలవల్లో వేస్తున్నారని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తారక రామనగర్, బాలాజీ నగర్ లలో MHO & మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. నూతనంగా నిర్మించాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, పెండింగ్ సమస్యలపై అధికారులు, స్థానిక నాయకులతో కలిసి చర్చించారు.
SkLM: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించుకున్నారు. వైసీపీ నాయకుడు ఏడవకు సత్యారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవాడ చక్కర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరావు అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరు సేవలను కొనియాడారు. ఈ వైసీపీ నాయకులు ఏడువాక సత్యరావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
E.G: విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అల్లూరి అని కొనియాడారు.
SKLM: వజ్రపుకొత్తూరు మండలం తేరపల్లి -కొండఊరు సాగునీటి కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కలు తొలగించడం పనులును జనసైనికులుతో కలిసి పలాస జనసేనపార్టీ సమన్వయకర్త డా. దుర్గారావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా కాలువల్లో పూడిక పేరుకుపోయి శివారు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.
KDP: నూతనంగా ఎన్నికైన ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభపాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. అమ్మవారిశాలలో అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావుతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA లింగారెడ్డి, మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవరెడ్డి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
KDP: క్రమశిక్షణ, చక్కటి శరీర సౌష్ఠవానికి డ్రిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. G రవీంద్రనాథ్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో NCC క్యాడెట్లకు రైఫిల్ డ్రిల్ గురువారం నిర్వహించారు. NCC కెప్టెన్ డాక్టర్ నీలయ్య మాట్లాడుతూ.. ఆర్మీ, నేవి, వాయుసేన రంగాల్లో NCC క్యాడెట్లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
KDP: రాష్ట్రంలో కూటమి నాయకులు వైసీపీ నాయకులపై దాడి చేయడమే లక్ష్యంగా పనిచేయడం దారుణమని వైసీపీ ఎస్సీ సెల్ కడప అధ్యక్షుడు కంచుపాటి బాబు మండిపడ్డారు. చంద్రగిరి మండలం పనపాకంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని అన్నారు. చంటిబిడ్డ ఉందని కూడా చూడకుండా కనికరం లేకుండా ఇలాంటి దాడులు చేయడం బాధాకరమని తెలిపారు.
KRNL: ఆత్మకూరులో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. TDP ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వచ్చిన నంద్యాల MP బైరెడ్డి శబరిని స్థానిక TDP నాయకులు అడ్డుకున్నారు. MLAకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు.