కృష్ణా: పెడన మండలం నందిగామ పంచాయతీలో ఒడ్డు చెరువులో గుర్రపు డెక్క తొలగించే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు స్వచ్ఛందంగా కూలీలతో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టారు. గుర్రపు డెక్క తొలగించడంతో నీరు ఒకచోట నిలిచిపోకుండా సాఫీగా ప్రవహిస్తుందని నాగేశ్వరరావు తెలిపారు.
SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన టెంక విశ్వనాథం (36) సోమవారం ఉదయం బూరగాం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ… ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురై, మరోవైపు గొంతు నొప్పులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
NDL: రుద్రవరం మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహించబడనుందని ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఇవాళ తెలిపారు. మండల అధ్యక్షుడు మబ్బు బాలస్వామి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు సకాలంలో హాజరు కావాలని, శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు.
తిరుపతి: ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.
AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రిన్సిపాల్ సంధ్య తెలిపారు. మంగళవారం నుంచి వచ్చే నెల మార్చి 31 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://www.cse.ap.gov.in , https://www.apms.apcfss.in అనే వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఈ నెల 24, 25, 26 తేదీల్లో విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ముఖ్య సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం తెలిపింది. 27వ తేదీ నుంచి మళ్లీ యథావిధిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం వెల్లడించింది.
CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం పుంగనూరు రాంపల్లి సమీపానగల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రిలే దీక్షలు చేపట్టారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
VSP: అమరావతి సచివాలయంలో సింహాచలం దేవస్థానం భూ వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు విశాఖ ఎంపీలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజులు పాల్గొని భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు వెల్దుర్తిలో నేటీతో 2వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్మికులు దీక్షలను కొనసాగిస్తున్నారు. 2వ రోజు దీక్షలను చిన్న వ్యాపారస్తుల కర్నూలు కమిటీ సభ్యుడు రామాంజనేయులు ప్రారంభించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
KRNL: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 101వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, అశోకానంద రెడ్డి, రఘురామయ్య, కృష్ణమూర్తి, కమతం వెంకటేష్ దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని JAC నాయకులు డిమాండ్ చేశారు.
BPT: వైద్య ఖర్చులకు పేదలు అప్పుల పాలు కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం రేపల్లె క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ.19.09 లక్షల విలువైన చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.
SKLM: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు మంగళవారం సందర్శించారు. మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలిగాంలో ఆదిత్య కళాశాల పరీక్షా కేంద్రాలను కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్‌లు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
KRNL: పెద్దకడబూరులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.1.90 కోట్ల వ్యయంతో 3.O కింద, NREGS పథకం మెటీరియల్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించాయి. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకంతరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: కూటమి ప్రభుత్వం హార్టికల్చర్‌కు ప్రోత్సాహంగా అరటి తోటలకు పండ్ల కవర్లపై 50% సబ్సిడీ ప్రకటించింది. రాజంపేటలో సుమారు 5,000 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. రైతులు కవర్లు కొనుగోలు చేసి బిల్లులు ఉద్యాన శాఖకు సమర్పిస్తే ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందుతుంది. గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు, అంటే రూ.25 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని అధికారులు తెలిపారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత లక్ష్మీనారాయణ రెడ్డి మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, స్వామివారి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరిని పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు.