E.G: కొవ్వూరులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా 860 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి అనురాధ తెలిపారు. ఇందులో 50 సివిల్, 77 క్రిమినల్ కేసులతో పాటు పాత కేసులు కూడా పరిష్కరించగా, మొత్తం రూ.3,24,795 కక్షిదారులకు చెల్లించేలా ఒప్పందాలు కుదిరాయన్నారు. రాజీ మార్గం వల్ల సమయం-ధనం ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.