సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.38.75 లక్షల చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్ అండ్ బి వసతిగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 450 మందికి రూ.3.97కోట్ల సాయం అందించినట్లు ఆయన తెలిపారు.