HYD: ఆస్తి పన్ను పరిష్కార మేళా అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో ఈనెల 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. OTS సమస్యలు తలెత్తుతున్న వేళ, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.