ATP: గుత్తిలో శుక్రవారం ఒక్కసారిగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఎన్నడు లేని విధంగా కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 300, కేజీ మటన్ ధర రూ.750-రూ.800 వరకు ధర పలుకుతుందని చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో కోళ్లు దొరకడం లేదని, అందుకే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు పెరిగాయి అన్నారు. దీంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.