• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పన్నులు వసూళ్లలో వినుకొండ ప్రథమ స్థానం

PLD: వినుకొండ పురపాలక సంఘం పన్నులు వసూళ్లలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీలు మొత్తం 126 ఉండగా మార్చి 31 నాటికి పన్నులు వసూళ్లు 6.58 కోట్ల గాను 6.25 కోట్లు వసూలు చేసి 95 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ శివరాం ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు.

April 3, 2026 / 09:40 PM IST

పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు

GNTR: CM చంద్రబాబు శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా అక్కడ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు.

April 3, 2026 / 09:39 PM IST

గౌరీపట్నంలో శివయ్యను దర్శించుకున్న విశ్వనాథ్

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో కొలువై ఉన్న శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ భోగి విశ్వనాథ్ జి విచ్చేసి స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా విష్ణు సహస్ర నామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ పాల్గొన్నారు.

April 3, 2026 / 09:36 PM IST

కర్నూలులో చలివేంద్రం ప్రారంభం

కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ బాబు ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

April 3, 2026 / 09:30 PM IST

శ్రీవారి సన్నిధిలో నరసాపురం ఎమ్మెల్యే

W.G: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపించినట్లు పేర్కొన్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

April 3, 2026 / 09:30 PM IST

‘ఈనెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష’

బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ తెలిపారు. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

April 3, 2026 / 09:30 PM IST

వనిపెంటలో స్మశాన వాటిక ప్రారంభం

KDP: గ్రామాభివృద్ధిలో భాగంగా స్మశాన వాటికల ఏర్పాటు ఎంతో అవసరమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మైదుకూరు మండలం వనిపెంట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

April 3, 2026 / 09:30 PM IST

ఏప్రిల్ 16 నుంచి హెల్మెట్ తప్పనిసరి

బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘శిరో రక్ష–ప్రాణ రక్ష’ కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. ఏప్రిల్ 16 నుంచి బాపట్లలో హెల్మెట్ నిబంధన కఠినంగా అమలు చేస్తామన్నారు. అప్పటి వరకు వాహనదారులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.

April 3, 2026 / 09:22 PM IST

‘టీటీడీ ఛైర్మన్‌ను పదవి నుండి తొలగించాలి’

అమరావతి మండలం వైకుంటపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనైతిక కార్యకలాపాలతో తిరుమల పవిత్రతను దిగజారుస్తున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

April 3, 2026 / 09:04 PM IST

కాలువలో వృద్దురాలి మృతదేహం లభ్యం

కోనసీమ: అంబాజీపేటలోని ఓ కాలువలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతురాలు రజకపేటకు చెందిన నాగమ్మ (85)గా పోలీసులు గుర్తించారు. ముక్కామల-చినలంక మధ్య ఉన్న ప్రధాన పంటకాలువ లాకుల వద్ద ఆమె మృతదేహం లభ్యమైందని SI షేక్ సుభాని శుక్రవారం చెప్పారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని నాగమ్మ మార్చి 30న ఇంటి నుంచి వెళ్లిపోయింది అని తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిందన్నారు.

April 3, 2026 / 09:01 PM IST

దొంగ అరెస్ట్.. రూ.15 లక్షల ఆభరణాలు స్వాధీనం

NDL: జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పలు కేసుల్లో పాల్గొన్నట్లు శుక్రవారం గుర్తించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

April 3, 2026 / 09:00 PM IST

ఉరివేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ELR: కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్తాపం చెందిన సస్పెక్ట్ షీటర్ జోగా రవి కిరణ్ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ మండలం వట్లూరు నెహ్రూ కాలనీకి చెందిన రవికిరణ్ గతంలో దొంగతనం కేసులలో ముద్దాయిగా ఉండడంతో అతనిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ప్రస్తుతం అతను ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

April 3, 2026 / 09:00 PM IST

‘అమరావతి రాజధాని పూర్తీ అయ్యే అవకాశం లేదు’

PLD: వైసీపీ నినాదం మావిగన్ ఏపీ అభివృద్ధి మంత్రం కాబోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి రజిని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేస్తుందన్నారు. అయితే అమరావతి రాజధాని పూర్తి అవకాశం లేనేలేదని రాంబాబు ఘంటాపదంగా తెలిపారు.

April 3, 2026 / 08:48 PM IST

ఘర్ సోలార్ రూఫ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ప్రకాశం: గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూఫ్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు. మంత్రి 111 మంది ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు అందించారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం కలెక్టర్ పాల్గొన్నారు.

April 3, 2026 / 08:45 PM IST

పాలీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

CTR: పాలీసెట్- 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఈనెల 9 వరకు పొడిగించినట్లు పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ సావిత్రి తెలిపారు. 4 తేదీ నుంచి 9 తేదీకి దరఖాస్తు గడువు పొడిగించారన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు గడువు లోపల దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

April 3, 2026 / 08:44 PM IST