• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంటూరులో పేదల ఇళ్ల తొలగింపుపై ఆందోళన

GNTR: గుంటూరు నగరంలోని 56వ డివిజన్, మోతీలాల్ లైన్ పరిధిలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను ప్రభుత్వం తొలగించాలనే చర్యలపై ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తక్షణమే స్పందించారు. ఆమె స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.

March 27, 2026 / 03:30 PM IST

పెద్దాపురం సిఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

KKD: పెద్దాపురం సర్కిల్ ఇన్స్‌ఫెక్టర్‌గా వైఆర్‌కె శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఐగా పనిచేసిన విజయ్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో వై‌ఆర్కే శ్రీనివాస్ విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన సిఐ వైఆర్ కే శ్రీనివాస్‌కు స్థానిక ఎస్‌ఐ మౌనిక, స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

March 27, 2026 / 03:29 PM IST

మానవత ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం

W.G: ఉండి మండలం చెరుకువాడలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ.. కళాకారులను ఆదర్శించాలని, కళలను పోషించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో MPTC దంగేటి రామలింగేశ్వరరావు కవి, రచయిత కొల్లాబత్తుల సూర్యకుమార్ పాల్గొన్నారు.

March 27, 2026 / 03:28 PM IST

వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషన్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ వేడుకకు హాజరు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు. 

March 27, 2026 / 03:27 PM IST

టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో సిమెంట్ నగర్ జట్టు విజయం

NDL: బేతంచెర్ల మండలం బలపాలపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా మండల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సిమెంట్ నగర్ జట్టు ప్రథమ, బలపాలపల్లి జట్టు ద్వితీయ, బేతంచెర్ల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు పోలూరు సోదరులు, ఉన్నం సుధాకర్, జీవన్ చౌదరి రూ.20,000, రూ.10,000, రూ.5,000 బహుమతులు అందజేశారు.

March 27, 2026 / 03:26 PM IST

‘ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రం’

NLR: ముత్తుకూరు మండల కేంద్రంలో మంచి నీటి చలివేంద్రాన్ని సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త సురేశ్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతూ గుక్కెడు మంచినీళ్లు కావాలంటే కొనుక్కొని తాగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులకు నీటి అవసరం ఎంతో ఉంటుందని, అందుకోసమే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

March 27, 2026 / 03:24 PM IST

మైదుకూరులో రోడ్డు ప్రమాదం

KDP: మైదుకూరు పట్టణానికి చెందిన సూర్యనారాయణ (42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం సాయంత్రం తన కుమారుడు నారాయణను పాఠశాలలో వదిలేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా, కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నాడు.

March 27, 2026 / 03:19 PM IST

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగేశన

BPT: బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మండపాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

March 27, 2026 / 03:19 PM IST

సీఎం చంద్రబాబుతో తిక్కారెడ్డి భేటీ

KRNL: సీఎం చంద్రబాబును కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులపై ఆయన సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

March 27, 2026 / 03:16 PM IST

‘రదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత’

PPM: పార్వతీపురం నుంచి వల్లరిగుడబ వరకు రూ.2 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 03:15 PM IST

ఏప్రిల్ 1 నుంచి ‘శబల భోజనాల పండుగ’

VSP: సింహాచలం దేవస్థాన గోశాలలో ‘శబల భోజనాల పండుగ’ను ఏప్రిల్ 1 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల చలపతి రావు తెలిపారు. ప్రకృతి ఆధారిత పంటలతో ఆరోగ్యకరమైన వంటలను ప్రోత్సహించడం లక్ష్యమని చెప్పారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వంటలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

March 27, 2026 / 03:15 PM IST

శ్రీ కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే

SKLM: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 27, 2026 / 03:14 PM IST

తిరుపతి మహిళ నేతకు ఎమ్మెల్యే సూచనలు

TPT: తిరుమల దర్శనార్థం జనసేన ఎమ్మెల్సీ హరి ప్రసాద్ వచ్చారు. ఆయనకు తిరుపతిలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆ పార్టీ మహిళా నేత అకేపాటి సుభాషిణి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఇదే విషయమై ఆమెతో ఆయన మాట్లాడారు. వైసీపీపై ధైర్యంగా స్పందించినందుకు అభినందించారు. భష్యత్తులో ఘాటు వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. తమ అధినేత పవన్ ఇలాంటివి సహించరని హితవు పలికారు.

March 27, 2026 / 03:09 PM IST

సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న వెంకటరామిరెడ్డి

ATP: అనంతపురం నగరంలోని లక్ష్మినగర్ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత పాలకుడు శ్రీరామ చంద్రుడని కొనియాడారు.

March 27, 2026 / 03:09 PM IST

ట్రాక్టర్ ఢీకొని ఇరువురికి గాయాలు

PLD: నరసరావుపేట నుంచి ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం అన్నవరం వెళ్తున్న దాసరి శివ, పుల్లగూర నాగరాజులు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇక్కుర్తి కాలవ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరిని బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్న వారిని గమనించిన గ్రామస్థులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమీప హాస్పటల్‌కు తరలించారు.

March 27, 2026 / 03:00 PM IST