KDP: గండికోట జలాశయంలో శుక్రవారం 25.95 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమా మహేశ్వర్లు వెల్లడించారు. జలాశయం నుంచి జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్రా ఏమిలేదని.. జలాశయంలో 694.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
అన్నమయ్య : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర చేనేత శాఖ బృందం అధికారులు జాస్మిన్, సృష్టి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ELR: ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ షాజహాన్ (47) తన ఇంటి వైపుకు వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా షాజహాన్ మృతి చెందాడు.
ATP: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ధనుర్మాస పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తాదులు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం గావించారు.
KRNL: చెట్టుమీద నుంచి జారిపడిన బాలుడి నడుముకు కొయ్య గుచ్చుకోవడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఇర్ఫాన్ (12) గతనెల 15న రేగి చెట్టు ఎక్కి పండ్లు కోస్తూ కాలు జారిపడిన సమయంలో ఓ ఎండిన కొయ్య బాలుడి నడుములోకి గుచ్చుకుంది. మూడు గంటల పాటు శ్రమించి సర్జరీతో తొలగించామని వైద్యులు గురువారం తెలిపారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో నేడు జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగూరు, ఈడుపుగల్లు గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువెల్ ఓరంను మర్యాద పూర్వకంగా కలసి గిరిజనులు ఎదుర్కోంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గ్రామాల ప్రజలు రోడ్లు, మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సౌకర్యాలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం వందలాది భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనాభిషేకంలో స్వామివారు భక్తులకు కనువిందు చేశాడు. అంతకుముందు స్వామివారికి పంచామృతా, కుంకుమార్చనలు తోమాల సేవ తదితర పూజలు నిర్వహించారు.
VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శుక్రవారం విశాఖ సాగర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అలల ఉధృతి కారణంగా నోవాటెల్ హోటల్ ఎదుట ఉన్న సాగర తీరం కోతకు గురైంది. దీంతో తీరానికి ఆనుకొని ఉన్న పలు నిర్మాణాలు నేలమట్టమయ్యాయి
కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్-2024లో నిర్వహించిన M.SC. నానోటెక్నాలజీ 1వ సెమిస్టర్, సెప్టెంబర్-2024లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.
కృష్ణా: ఇటీవల జరిగిన నూజివీడు సభ ఘటనను ఆసరాగా చేసుకుని బీసీలను TDPకి దూరం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందని కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి మండిపడ్డారు. గురువారం ఆయన ఉయ్యూరులో మాట్లాడుతూ.. బీసీలలో పట్టున్న TDP నాయకులపై బురద జల్లాలని వైసీపీ పన్నిన పన్నాగం భగ్నమైందన్నారు. TDPకి బీసీలే వెన్నుదన్ను అని, వారిని పార్టీ నుంచి వేరు చేయలేరని పేర్కొన్నారు.
ASR: అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పింపలుగుడ గ్రామంలో ఈనెల 22న మమత చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జన్ని గోపాల్, ఎం.లచ్చు, కిల్లో మహేష్ చెప్పారు. ఈ మెగా వైద్య శిబిరానికి అరకులోయ సబ్ ఇన్‌స్పెక్టర్, స్థానిక సర్పంచ్, ఆహ్వాన పత్రం ఇచ్చామన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ASR: అరకులోయ మండలంలో నియండపల్లివలసలో వీధిలైట్లు వెలగడం లేదు. దీంతో ఆ వీధి వాసులు అంధకారంలో గడుపుతున్నారు. సుమారు నెలరోజులుగా వీధి దీపాలు వెలగక పోయినా అధికారులు, పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయితీ కార్యదర్శికి పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వీధి దీపాలు వెలగాక రాత్రి సమయం బయటకు రావాలంటే చీకటిగా ఉండడంతో భయపడుతున్నారు.
SKLM: టెక్కలి సబ్ కలెక్టరేట్‌లో డివిజన్ స్థాయి ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. గృహనిర్మాణ శాఖ లక్ష్యాలను వేగవంతంగా అమలు చేయాలని అన్నారు. టెక్కలిలో 242 ఇళ్ల లే అవుట్లలో గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలన్నారు.