AKP: కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం పోస్టర్‌ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల దగా చేస్తుందని మండిపడ్డారు.
W.G: రాజమండ్రి ఎయిర్ పోర్టులో గురువారం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ బస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ముప్పిడి ఎయిర్ బస్ సర్వీస్ ప్రారంభోత్సవం చేశారు.
W.G: అమరావతి సచివాలయంలో గురువారం రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అధ్యక్షతన పలు అంశాలు పై చర్చించారు. నీటిపారుదల శాఖకు సంబంధించి పలు సూచనలు చేసినట్లుగా మంత్రి నిమ్మల తెలిపారు.
KDP: అన్నదాతలకు అండగా రేపు వైసీపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులతో, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్తో ఆయన సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలుస్తూ వారి మద్దతుగా రేపు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ ఉంటుందన్నారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ ఛైర్మన్ ముక్తియార్ వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఉర్దూ స్కూళ్ళలో టీచర్ల కొరతను పరిష్కరించాలన్నారు.
ELR: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 13న ఏలూరులో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం లింగపాలెంలో నిరసన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
VZM: ఈనెల 19వ తేదీ వరకు ఎస్‌కోట ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణా తరగతుల శిబిరాన్ని ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం ప్రారంభించారు. మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, మండల శాఖల అధికారులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటారని తెలిపారు.
KDP: పెండ్లిమర్రి మండలం రేపల్లె గ్రామం వద్ద ఏర్పాటుచేసిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తల, చేతి భాగాన్ని ధ్వంసం చేశారని టీడీపీ మండల నాయకుడు ఎస్పీ గంగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
PPM: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైతే మానసిక ప్రశాంతత సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద వెలసిన దుర్గ తల్లి అమ్మవారు ఆలయ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గ తల్లిని దర్శించుకొని అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు.
కృష్ణా: నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఉద్దేశించిన తాత్కాలిక భవనంలో ప్రభుత్వ కార్యాలయాలను ఎలా ఏర్పాటు చేస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత ఈనెల 11న కార్యాలయాలకు ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. వెంటనే 2 కార్యాలయాలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్నారు.
NLR: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. గురువారం ఉదయగిరి పట్టణంలోని స్త్రీ శక్తి భవన్‌తో ఉదయగిరి నియోజకవర్గం స్థాయి క్లస్టర్ సమావేశంలోఆమె మాట్లాడుతూ పాంపాండ్స్ ఏర్పాటులో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం వద్దని, జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ (64) హఠాన్మరణంపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కూటమి నేతలతో కలసి మంత్రి కొల్లు రవీంద్రని పరామర్శించారు.
కృష్ణా: వేటపై ఆధారపడి జీవించే యానాది కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం ఫుడ్ కోర్టులో 80 పేద కుటుంబాలకు నాబార్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ ద్వారా ప్రజా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 50లక్షలు విలువైన పడవలు అందజేశారు.
ELR: ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామంలో పంచాయతీ పైపులైన్‌ను మాజీ సర్పంచ్ సత్యనారాయణ, అతని భార్య సరస్వతిలు పెట్రోల్ పోసి తగులు పెట్టారని సర్పంచ్ రాజగోపాలరావు (గోపి) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పైపులైన్ వేస్తుంటే తగులు పెట్టడం దారుణమన్నారు. పక్కనే అంగన్వాడీ చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
ATP: ఓబులదేవరచెరువు మండలంలోని గౌనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగనవాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని ఆదేశించారు.