GNTR: నగరంలోని రింగ్ రోడ్ వద్ద MMK యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షష్టమ గణపతి మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 111 కేజీల భారీ లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో వట్టికూటి.జ్యోతి వంశీ ఫ్రెండ్స్ సర్కిల్ రూ.15,66,666 అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు.