అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. మహిళలపై జరిగే నేరాలను మొదటి దశలోనే అరికట్టాలని, సమాజం సహకారం అవసరమని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
పల్నాడు: ఈ నెల 8న జిల్లాలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె డీఆర్వో, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎస్, మెప్మా, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కర్నూలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని, మైనింగ్ అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో రెవెన్యూ, మైనింగ్, అటవీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారదర్శక అనుమతుల మంజూరు చేయాలన్నారు.
CTR: ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీట్ చేస్తామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప, నవరత్నాలు హెచ్చరించారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని వివిధ దుకాణాలు, హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో విక్రయిస్తున్న నిషేదిత కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
VSP: మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ శ్రీభరత్ అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన రూ.13.5 కోట్లలో కొంతమేర పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈమేరకు ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను పరిశీలించారు.
కోనసీమ: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా క్యాడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి గొల్లపల్లి అమూల్య తెలిపారు. రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం క్యాడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె ప్రజలు, పార్టీ శ్రేణులు నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి శ్యామల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సీ కులాల సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని సచివాలయం-2లో ఆధార్ సెంటర్‌ను సర్పంచ్ పల్నాటి బోడయ్య, ఎంపీడీవో వీరభద్రచారి, శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బ్రహ్మయ్య, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
బాపట్ల మండలం మున్నంగివారి పాలెంలో గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
NTR: జగ్గయ్యపేట ఎంపీడీవో మాధవ్ శర్మని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మండల పరిషత్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని ఎంపీడీవో మాధవ్ శర్మ తెలిపారు.
కృష్ణా: గ్రామ అభివృద్ధికి దాతల సహాయం ఆదర్శనీయం అని సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ తరిగోపుల పద్మావతి అన్నారు. గ్రామ ప్రముఖులు మాకినేని దుర్గాప్రసాదు శుక్రవారం స్వచ్ఛ సుందర చల్లపల్లి నిర్వహణ కోసం తనవంతుగా రూ. లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో డాక్టర్ పద్మావతికి అందచేశారు. దాత దుర్గాప్రసాదుకు డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డాక్టర్ పద్మావతి అభినందనలు తెలిపారు.
AKP: నాతవరం మండలం ఎంబిపట్నం పంచాయతీలో ఇంటి పన్నులు వసూళ్లపై శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రతీ పంచాయతీలో శత శాతం ఇంటి పన్నులు సకాలంలో వసూలు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు డిప్యూటీ ఎంపీడీవో కే మూర్తి బాబు అన్నారు. గృహ యజమానులు పంచాయతీకి ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు.
సత్యసాయి: కదిరి టౌన్ కుమ్మరోల్లపల్లి శ్రీరాముల గుడి వద్ద విగ్రహాలను ధ్వంసం చేసిన కుంచపు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ గోపురం పనుల విషయంలో యజమాన్యంతో ఏర్పడిన ఆర్థిక విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో తేలింది. తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా, పనిని వేరే వారికి అప్పగించారనే కోపంతోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు: జోన్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు సమక్షంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జావిద్ బృందం ఫిజికల్ పరీక్షలు నిర్వహించింది. అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మెడికల్ పరీక్షలు జరిగాయి.