కృష్ణా: గ్రామ అభివృద్ధికి దాతల సహాయం ఆదర్శనీయం అని సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ తరిగోపుల పద్మావతి అన్నారు. గ్రామ ప్రముఖులు మాకినేని దుర్గాప్రసాదు శుక్రవారం స్వచ్ఛ సుందర చల్లపల్లి నిర్వహణ కోసం తనవంతుగా రూ. లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో డాక్టర్ పద్మావతికి అందచేశారు. దాత దుర్గాప్రసాదుకు డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డాక్టర్ పద్మావతి అభినందనలు తెలిపారు.