సత్యసాయి: నల్లమాడ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పరీక్షా ఫలితాలలో పేదింటి ఆణిముత్యాలు అత్యధిక మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్‌లో నందు చైతన్య 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచారు జి చెన్నమ్మ 475 మార్కులు సాధించి సెకండ్ స్థానంలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 24 మందికి 22 మంది ఉత్తీర్ణత సాధించారు.
SKLM: ఆమదాలవలసకు చెందిన తమ్మినేని సుజాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి బుధవారం జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సుజాత సేవలందిస్తున్నారు. ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ATP: ముంబై(CSMT) నుంచి చెన్నై వెళ్లే సమ్మర్ స్పెషల్ రైలు, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ రైలు ప్రతి ఆదివారం ముంబై (రైలు నెం 01015) నుంచి బయలుదేరుతున్నట్లు తెలిపారు. చెన్నై (రైలు నెం 01016) నుంచి ప్రతి సోమవారం బయలుదేరనుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు రద్దీ రీత్యా నడపనున్నట్లు తెలిపారు.
VZM: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు సమక్షంలో బొబ్బిలిలో 9వ వార్డుకు చెందిన ముడశల దుర్గాప్రసాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలోని 36 వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు.
GNTR: తెనాలిలో మాదకద్రవ్యాల కేసు సంచలనం సృష్టించింది. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ASR: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆయన బుధవారం చింతూరు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనమిత్ర యాప్ ద్వారా అందుతున్న సేవలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రకాశం: పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ బుధవారం యర్రగొండపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత, నియోజకవర్గ ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
TPT: సూళ్లూరుపేట మండల నూతన తహసీల్దార్‌గా శైలకుమారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దొరవారిసత్రం తహసీల్దార్‌గా పనిచేసిన అనుభవంతో మండల పరిపాలనపై మంచి పట్టున్న ఆమె, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజా అర్జీల పరిష్కారంలో జాప్యం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
KRNL: ఎమ్మిగనూరుకు చెందిన కరె దినేష్ ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. విజయవాడ నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న దినేష్, ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించాడు. చేనేత కుటుంబానికి చెందిన కరె కృష్ణ, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడైన దినేష్‌ను పలువురు అభినందించారు. ఆయన తల్లిదండ్రులు ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు.
AKP: పాయకరావుపేట మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాలను ప్రదర్శించినట్లు ఎంపీడీవో లవరాజు బుధవారం తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు అందరూ ఓటరు జాబితాలను పరిశీలించి పొరపాట్లు, తప్పులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
ELR: మండూరు, వేగివాడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగివాడ నుంచి ఏలూరు వైపు వస్తున్న ఆటో చక్రాయగూడెం వద్ద పామ్ ఆయిల్ తోటలోకి దూసుకువెళ్ళింది. ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల టీడీపీ ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు కీలకమైన పొలిట్ బ్యూరోలోనూ ఆయనకు, ఆయన కుమారుడు రవితేజకు పార్టీ అధిష్ఠానం మొండి చేయి చూపింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకోలేకపోయిన గంటా తాజాగా పార్టీ పదవుల్లోనూ ఎలాంటి ప్రాధాన్యం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాయి.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కమిటీల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న వార్డుల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలని, సభ్యత్వ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసి ముద్రణకు పంపాలని నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు పేడాడ రమణికుమారి, నాయకులు పాల్గొన్నారు.
ATP: CM చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా రాయదుర్గం శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబం ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించే హోమాల్లో భాగంగా ఐదో రోజు భైరవి దేవి హోమం నిర్వహించారు. CM నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో వంట గ్యాస్ తీవ్ర కొరత నెలకొనడంతో గిరిజనులు మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో కుటుంబాలు అడవుల నుంచి కట్టెలు సేకరించి వంట చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు రాకపోవడం, కొన్నిచోట్ల 20–30 రోజుల వరకు ఆలస్యం జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.