• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ రాష్ట్ర కమిటీలో ప్రణవ్ గోపాల్‌కు కీలక పదవి

VSP: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేసిన ప్రణవ్ గోపాల్‌కు రాష్ట్ర కమిటీలో కీలక పదవి లభించింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకం జరగడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. అతి చిన్న వయసులోనే ఈ స్థానం దక్కించుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం వీఎంఆర్డీఏ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు పార్టీ మరింత బాధ్యతలు అప్పగించింది.

April 15, 2026 / 01:17 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బైరెడ్డి శబరి

NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి కృతజ్ఞతలు తెలియజేసింది.

April 15, 2026 / 01:14 PM IST

నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

VZM: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పోరాటంతో పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన లోకేశ్ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో, మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.

April 15, 2026 / 01:13 PM IST

టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే మద్దిపాటి

E.G: టీడీపీ పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలలో భాగంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును జోనల్ కోఆర్డినేటర్‌గా బుధవారం ఎంపిక చేశారు. ఈ ఎంపిక పట్ల గోపాలపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు వారు తెలియజేశారు.

April 15, 2026 / 01:11 PM IST

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న గుడివాడ అమరనాధ్

ASR: చింతపల్లి ఆరాధ్య దైవం ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకున్న ఏపీ మాజీ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవాల సందర్బంగా స్థానిక నాయకులు ఆహ్వానం మేరకు విచ్చేసి ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని స్థానిక ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

April 15, 2026 / 01:11 PM IST

అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు: కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించాలని సూచించారు.

April 15, 2026 / 01:10 PM IST

క్రికెట్ ఆడిన మంత్రి లోకేశ్

TPT: తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో షాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణులు పీవీ సింధు, మిథాలి రాజ్‌లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిని ప్రోత్సహించారు.

April 15, 2026 / 01:10 PM IST

తెనాలిలో అగ్నిప్రమాదాలపై అవగాహన శిక్షణ

GNTR: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వినియోగం, మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించే విధానాలపై అక్కడి సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.

April 15, 2026 / 01:10 PM IST

ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ

కోనసీమ: మైనారిటీల అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన CM చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారులు అహమ్మద్ షరీఫ్‌కు బుధవారం మండపేట TDP రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మైనారిటీ విద్యా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు.

April 15, 2026 / 01:10 PM IST

కమలాపురంలో ఓ పాఠశాలకు నోటీసులు జారీ

కడప: కమలాపురం ఓ పాఠశాలకు ఎంఈఓ బేబీ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్నట్లు గుర్తించారు. అవసరమైన వసతులు లేకపోవడంతో గతంలో అనుమతి నిరాకరించినప్పటికీ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. నోటీసుల అనంతరం స్కూల్ మూసివేతతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

April 15, 2026 / 01:09 PM IST

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన చరిత

KRNL: గూడూరు మండలం పెంచికలపాడుకు చెందిన గాడే చరిత ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988 మార్కులు సాధించి సత్తా చాటింది. నంద్యాల జిల్లా నెరవాడ ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతూ ఆమె ఈ ఘనత సాధించింది. తన తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ తనను చదివించారని చరిత పేర్కొంది. ఫలితాలలో పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

April 15, 2026 / 01:09 PM IST

‘జిల్లా అధికారులు పూర్తిగా విఫలం’

బాపట్ల జిల్లాలో రేషన్ మాఫియా యథేచ్ఛగా సాగుతుండటానికి జిల్లా అధికారులు వైఫల్యమే కారణమని BSP బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు ఆరోపించారు. పేదలకు చెందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేషన్ అక్రమాలను అరికట్టడంలో DSO పూర్తిగా విఫలమయ్యరని పేర్కొన్నారు.

April 15, 2026 / 01:08 PM IST

గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చిత్తూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వారి చదువుల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 15, 2026 / 01:07 PM IST

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ముళ్ళపూడి భాపిరాజు

E.G: పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ రాష్ట్ర అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, గోపాలపురం నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు ముళ్ళపూడి భాపిరాజు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 15, 2026 / 01:07 PM IST

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొమ్మలపాటి

PLD: మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులుగా అధిష్టానం అవకాశం కల్పించింది. మొత్తం ఏడు మందికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపిక జరిగింది. గతంలో కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పని చేశారు. నూతనంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడంతో కార్యకర్తలు అభిమానులు ముఖ్య నేతలు కొమ్మాలపాటికి శుభాకాంక్షలు తెలిపారు.

April 15, 2026 / 01:06 PM IST