TPT: తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో షాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణులు పీవీ సింధు, మిథాలి రాజ్‌లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిని ప్రోత్సహించారు.