• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం’

అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపునిచ్చారు. పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా పెట్టి డ్రగ్స్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 112 మంది అనుమానితులపై నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

March 28, 2026 / 05:03 PM IST

జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

CTR: చిత్తూరు జిల్లాలోని అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

March 28, 2026 / 05:00 PM IST

వత్తాడలో భారీ కింగ్ కోబ్రా హల్‌చల్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో శనివారం సుమారు 14 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమై భయాందోళన సృష్టించింది. భారీ విషసర్పాన్ని చూసిన స్థానికులు భయంతో దానిని హతమార్చారు. ఇటీవల అటవీప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు తరచూ కనిపిస్తున్నాయని, పోడు వ్యవసాయానికి వెళ్లడానికే భయంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 28, 2026 / 05:00 PM IST

విజయవాడలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

NTR: విజయవాడ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పునూరు గౌతమ్ రెడ్డి జెండా ఆవిష్కరించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.

March 28, 2026 / 05:00 PM IST

కలెక్టరేట్లో పుట్టపర్తికి నివాళులర్పించిన అర్పించిన జేసీ

PLD: నరసరావుపేట కలెక్టరేట్లో ప్రముఖ కవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ సూచన మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ సంజన సింహా పాల్గొని, పుట్టపర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహితీ సేవలను, గ్రంథ రచనలను కొనియాడారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

March 28, 2026 / 05:00 PM IST

మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి

PPM: జిల్లాలో మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ విమల పాలకొండలో రైతు సంఘం నాయకుడు బుడితి అప్పలనాయుడిని శనివారం కలసి సమస్య పరిష్కారంపై చర్యలు వివరించారు.

March 28, 2026 / 04:55 PM IST

సిలిండర్లతో పరారైన గ్యాస్ బాయ్..!

VSP: గాజువాకలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న గ్యాస్ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారయ్యాడు. కస్టమర్ల వద్ద నుంచి ఓటీపీలు సేకరించి సిలిండర్లు ఇవ్వకుండా పరార్ కావడంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిన అప్పారావు ఎంతకీ ఏజెన్సీకి రాకపోవడంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 28, 2026 / 04:54 PM IST

బండలాగుడు పోటీలను ప్రారంభించిన బీసీ రాజారెడ్డి

NDL: బనగానపల్లె మండలం పసుపల గ్రామంలో ఇవాళ బండలాగుడు పోటీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఘనంగా ప్రారంభించారు. రైతు సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ రాజారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు పోటీలలో గెలుపొందిన వారికి ఆయన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

March 28, 2026 / 04:54 PM IST

‘నేర నియంత్రణకు కట్టుదిట్టమైన తనిఖీలు’

VZM: జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

March 28, 2026 / 04:52 PM IST

గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

GNTR: గ్రూప్-2 ద్వారా ఎంపికైన 10 మంది అభ్యర్థులకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం నియామక పత్రాలు అందజేశారు. విధుల్లో చేరే ముందు అభ్యర్థులు 12 రోజుల శాఖాపరమైన శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సేవల్లో క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు.

March 28, 2026 / 04:50 PM IST

అక్రమ నిర్మాణాలపై సత్యనారాయణ ఫైర్

VSP: జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని జనసేన బహిష్కృత నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ‌నివారం ఆయ‌న ఓప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అవినీతి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

March 28, 2026 / 04:46 PM IST

12వ సంవత్సరం చలివేంద్రం ప్రారంభం

KDP: కమలాపురంలో మన ఊరు సేవా సమితి ఆధ్వర్యంలో 12వ సంవత్సరం చలివేంద్రం కార్యక్రమాన్ని సీఐ మోహన్ ప్రారంభించారు. ఎండల సమయంలో దాహంతో ఉన్న వారికి నీరు అందించడం గొప్ప సేవ అని ఆయన తెలిపారు. సమితి సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ సేవను కొనసాగించడం అభినందనీయం అని సీఐ మోహన్ కొనియాడారు.

March 28, 2026 / 04:45 PM IST

‘వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి’

VZM: తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విజయనగరం మండలం, గుండాలపేట గ్రామంలో ఉచిత వైద్యశిబిరం వి డెంటల్ కేర్, శ్రీనిధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కంది జగదీశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదీప్, శ్రీనిధి భానుప్రసాద్, భీమ్ శంకర్, ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణరావు పాల్గొన్నారు.

March 28, 2026 / 04:45 PM IST

పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి

AKP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని జాయింట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ సూచించారు. శనివారం సబ్బవరం కేజీబీవీలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు.

March 28, 2026 / 04:41 PM IST

వైసీపీ సమాజానికి హానికరం: మంత్రి పయ్యావుల

ATP: వైసీపీ ఈ సమాజానికి హానికరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. అమరావతి ప్రజల రాజధాని అని, అది త్వరలోనే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జగన్ అనేక మాటలు మార్చారని విమర్శించారు. 

March 28, 2026 / 04:40 PM IST