GNTR: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. మస్తాన్ దర్గా వెనుక ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, ఏటి అగ్రహారం 13వ లైన్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సీఎస్ఆర్ నిధులతో ఆధునికరించడం జరిగింది. పలు హాస్టల్‌ను కలెక్టర్ పరిశీలించారు.
కడప నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో YSRTUC ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CEC సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, తదితరులు హాజరయ్యారు.
ELR: వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముళ్లగిరి ఇమ్మానుయేల్ మరణం పార్టీకి తీరని లోటని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు అన్నారు. శనివారం ఇమ్మానుయేల్ భౌతిక కాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలను సందర్శించారు. పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూడాలని యజమానులకు సూచించారు. అవసరమైతే మంత్రి స్వయంగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.
NDL: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని ఇవాళ సీపీఎం నాయకుడు సుధాకర్ డిమాండ్ చేశారు. బీసీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల పట్ల వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇతనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ATP: పామిడి పోలీస్ స్టేషన్‌లో శనివారం నూతన ఎస్సైగా రాఘవేంద్రప్ప బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి స్వాగతం పలికారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.
TPT: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
NLR: నియోజవర్గంలోని కోవూరు బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. ఆయా మండలాల్లో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నియోజవర్గంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
E.G: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబు ఉన్నారు.
SKLM: పాతపట్నంలోని ఐదు మండలాలలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికరించాలి అని MLA గోవిందరావు కోరారు. శనివారం విజయవాడలోని అసెంబ్లీ జీరో అవర్‌లో రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో ఉన్న ఇండోర్ స్టేడియం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
CTR: పూతలపట్టులో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మండలంలో ఇప్పటికే పలు హోటల్లో కమర్షియల్ సిలిండర్ల లేక మూతపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లు బుక్ చేసినా వారం నుంచి పది రోజులకు కూడా ఓటీపీ రాకపోవడం, వచ్చిన తర్వాత కూడా సిలిండర్లు సమయానికి ప్రజలకు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్‌లో నాలుగు ప్రాంతాల్లో రూ.1.3 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల పంచాయితీలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి చేతుల మీదుగా స్వచ్ఛ రథం ప్రారంభించారు. కాశిరెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ రథం గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వీకరించి వాటికి ప్రతిగా అవసరమైన వస్తువులను అందించే విధంగా పనిచేస్తుందన్నారు.
KRNL: ఐజ నుంచి ఎమ్మిగనూరు వస్తున్న ఆర్టీసీ బస్సుకు భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నందవరం సబ్‌స్టేషన్ సమీపంలో స్టీరింగ్ వీల్ తెగిపోవడంతో బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగా డ్రైవర్‌ను అభినందించారు
ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో శనివారం కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో ఛైర్మన్ కర్ణ తిరుపతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులకు ఉచిత టీకాలు వేశారు. గొర్రెలకు సీ ఇస్తున్నారు వ్యాధులు చూపకుండా మందులు పంపిణీ చేశారు. అనంతరం రాయితీపై పశువుల మేత కోసం జొన్నలు ఐదు కేజీల బ్యాగులను గ్రామస్తులకు పంపిణీ చేశారు.