ప్రకాశం: రాచర్ల మండలంలోని నెమలిగుండం రంగనాయక స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 5వ తేదీ వరకు రెండు రోజుల పాటు, పొదిలి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శంకర్ తెలిపారు. అలాగే తూర్పు గంగవరం వద్ద ఉన్న గుంటి గంగమ్మ తిరుణాలకు ఇవాళ ప్రత్యేకంగా 15 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: సింగరాయకొండలో ఎస్వీ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేంద్ర గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.20,300 నగదును సీజ్ చేశామన్నారు. పక్కా సమాచారం మేరకు ఎస్వీ లాడ్జిపై దాడి చేయగా.. ఆరుగురు పేకాడుతూ పట్టుపడ్డారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచార వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 5న సంకటహర గణపతి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 5గంటలకు మూడు విడతలుగా వ్రతం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.500 టికెట్టు కొనుగోలు చేసి వ్రతంలో పాల్గొనవచ్చని సూచించారు. సాయంత్రం 7 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామన్నారు.

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే. బాలింతలు తమ బిడ్డకు ఇచ్చి మిగిలిన పాలు వృథా చేస్తుంటారు. వీటిని దానం చేస్తే మరికొందరు పిల్లల ఆకలి తీర్చవచ్చని, డెలివరీ అయిన 4వ రోజు నుంచి 6నెలల వరకు పాలు డొనేట్ చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మీకు ఆసక్తి ఉంటే మిల్క్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

TPT: టీటీడీకి అశోక్ లేల్యాండ్ సంస్థ రూ.8.75 లక్షల విలువైన మినీ ట్రక్‌ను విరాళంగా అందించింది. శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఏరియా మేనేజర్ మహ్మద్ నజీరుద్దిన్ హాజరయ్యారు. అనంతరం వాహన తాళాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.

CTR: చౌడేపల్లె మండలం కాగతి పంచాయతీ కరణంవారిపల్లె సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 35 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామికి అభిషేకాలు చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేసి అన్నదానం చేశారు
కోనసీమ: రాజోలు మండలంలో 16 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ లను నియమిస్తూ ఎంపీడీవో కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాటిపాక, రాజోలు, తాటిపాక, శివకోడు మేజర్ పంచాయతీలకు తహసిల్దార్ భాస్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఎంఈవో, అగ్రికల్చర్ ఏవో హార్టికల్చర్ అధికారులు మిగిలిన గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.
E.G: ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో గురువారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ వై.మేఘా స్వరూప్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
VSP: రైల్వే స్టేషన్ మార్గంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని సీపీ డా. శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్, నగర పోలీసులతో సమన్వయ సమావేశం కమిషనరేట్లో నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో భద్రత బలోపేతం, దొంగతనాల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు
ATP: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్యే బండారు శ్రావణి కొనియాడారు. ప్రజల త్యాగంతో నిర్మితమైన రాజధానిపై చట్టముద్ర పడటంతో ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు చిగురించాయన్నారు. అమరావతిని కదిలించడం ఎవరివల్లా కాదని, అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
NLR: జిల్లాలో అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం అధికారులను ఆదేశించారు. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.3,063.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.