• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పీ.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి’

ELR: పీ.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి రైతు సంఘం నాయకులు సమస్యను వివరించారు.

April 11, 2026 / 04:00 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన PACS ఛైర్మన్

E.G: రంగంపేట రైతు సేవా కేంద్రం వద్ద యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం PACS ఛైర్మన్ గారపాటి రాంబాబు ప్రారంభించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 11, 2026 / 04:00 PM IST

జిల్లా వ్యాప్తంగా ‘మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే’

KRNL: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.

April 11, 2026 / 04:00 PM IST

జిల్లా వ్యాప్తంగా ‘మెగా కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ డే’

KRNL: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డాన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.

April 11, 2026 / 04:00 PM IST

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల గోడపత్రిక ఆవిష్కరణ

కోనసీమ: బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుంచి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం తెలిపారు. శనివారం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కబడ్డీ పోటీలకు సంబంధించి గోడ పత్రికలను పాలూరి సత్యానందం ఆవిష్కరించారు.

April 11, 2026 / 04:00 PM IST

‘రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి’

అన్నమయ్య: రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. గిట్టుబాటు ధరలు, ఎరువుల కొరత, మార్కెట్ దోపిడీతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

April 11, 2026 / 04:00 PM IST

దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు నిరసన

ELR: వైసీపీని, పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద నీచ, నికృష్టమైన భాషతో దూషించిన ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలం పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.

April 11, 2026 / 04:00 PM IST

ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

CTR: నగరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన కార్యాలయంలో వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి సూచనలు చేశారు. సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.

April 11, 2026 / 04:00 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాసరెడ్డి

KDP: ఖాజీపేట అగ్రహారంలో జరిగిన యువతి కీర్తన హత్య ఘటనపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ మార్చురీలో మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 11, 2026 / 04:00 PM IST

ఆకివీడు పరిసరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

W.G: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆకివీడు పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంబడి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నియంత్రించేందుకు తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం ట్విన్ బిన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సాకేత్, సిబ్బంది పాల్గొన్నారు.

April 11, 2026 / 04:00 PM IST

ఎయిర్‌పోర్ట్ పేరుతో విధ్వంసం వద్దు: CPM

SKLM: కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షన శనివారం పలాసలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూమిపైన ఉపాధి పొందుతున్న ప్రజలకు భూమి నుంచి వెళ్లగొడితే ఈ ప్రాంతమంతా నాశనం అయిపోతుందని వారు పేర్కొన్నారు.

April 11, 2026 / 03:56 PM IST

‘సమస్యలు సత్వరమే పరిష్కరించండి’

SKLM: పలాస నియోజకవర్గం, మందస, పలాస మున్సిపాలిటీ, వజ్రపు కొత్తూరు మండలం ప్రజలు ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు “ప్రజా దర్బార్” నిర్వహించారు. ప్రజల నుంచి 42 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించినట్లు ఆమె తెలిపారు.

April 11, 2026 / 03:56 PM IST

తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు ఆయనను దుశ్శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

April 11, 2026 / 03:56 PM IST

కిషన్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ASR: డుంబ్రిగూడ మండలం పనసపుట్ గ్రామంలో కిషన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వంతల ఆనందరావును కాంగ్రెస్ శ్రేణులు సన్మానించారు. అనంతరం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గంగాధర్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

April 11, 2026 / 03:54 PM IST

గోడ పత్రికను ఆవిష్కరించిన హోంమంత్రి

AKP: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రశాంతత చేకూరుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్.రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈ నెల 26న ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

April 11, 2026 / 03:54 PM IST