కోనసీమ: బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుంచి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జరుగుతాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం తెలిపారు. శనివారం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కబడ్డీ పోటీలకు సంబంధించి గోడ పత్రికలను పాలూరి సత్యానందం ఆవిష్కరించారు.