• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భార్య అలిగి వెళ్లిందని..

MDK: బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామానికి చెందిన రవి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య, కుమారుడు ఇంటి నుంచి అలిగి వెళ్లిపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఎడమ చేతిని కత్తితో లోతుగా కోసుకున్నాడు. బంధువులు 108 వాహనంలో PHCకి తరలించగ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

April 3, 2026 / 06:22 AM IST

పదో పరీక్షలు ముగింపు.. 6 నుంచి పేపర్ల మూల్యాంకనం

GNTR: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మార్చి 16 నుంచి సాగిన పరీక్షలకు సుమారు 27 వేల మంది హాజరయ్యారు. రంజాన్ కారణంగా వాయిదా పడిన ఆంగ్ల పరీక్ష చివరిగా నిర్వహించారు. పరీక్షలు ముగియగానే విద్యార్థులు ఆనందంగా బయటకు వచ్చారు. ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదు. స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేశారు. కాగా, ఈ నెల 6 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.

April 3, 2026 / 06:21 AM IST

అమరావతికి చట్టబద్ధత‌పై జిల్లాలో హర్షం

KRNL: పార్లమెంటు ఉభయ సభల్లో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత‌ బిల్లు ఆమోదం పొందడంపై నగరపాలక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కేఎంసీ అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీశ్ కుమార్, ఉద్యోగులు కొవ్వత్తులు పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు.

April 3, 2026 / 06:21 AM IST

జిల్లాకు తేలికపాటి వర్ష సూచన

సత్యసాయి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 39.9 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయని విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. నైరుతి దిశ నుంచి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

April 3, 2026 / 06:16 AM IST

తాగునీటి పథకాలపై ఎమ్మెల్యే సమీక్ష

అన్నమయ్య: కలికిరి మండలం నగిరిపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం RWS అధికారులతో సమీక్ష నిర్వహించారు. “హర్ ఘర్ జల్” పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే పనులు వేగవంతం చేయాలని, గ్రామాల్లో నీటి కొరతను నివారించి కులాయి ద్వారా శాశ్వత సరఫరా కల్పించాలని ఆదేశించారు.

April 3, 2026 / 06:15 AM IST

మూడున్నర కేజీల గంజాయినీ స్వాధీనం

ప్రకాశం: కొండపి మండలం అనకర్లపూడి అట్లేరు సమీపంలో గురువారం సాయంత్రం ఐదుగురిని అరెస్ట్ చేసి, 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన కందిమల్ల నారాయణతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

April 3, 2026 / 06:14 AM IST

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

తిరుపతి కేటీ రోడ్డు రామకృష్ణ మిషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీ.రోహిత్ కుమార్ మృతి చెందారు. ముందు కారును తప్పించేందుకు వేగంగా వచ్చిన కియా కారెన్స్ (AP39WN8467) అతడి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోహిత్ మరణించారు. తండ్రి జీ.వెంకటేష్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

April 3, 2026 / 06:14 AM IST

‘గ్రామాల అభివృద్ధికి అదికారులదే కీలకపాత్ర’

PPM: ప్రత్యేక అదికారులు, పంచాయతీ కార్యదర్శులు, VROలు చిత్తశుద్దితో విదులు నిర్వహించాలని MLA బోనెల విజయచంద్ర సూచించారు. గురువారం బలిజిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారులు కీలక పాత్ర పోషించాలని పెర్కొన్నారు. విధుల్లో అలసత్వం కనబరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 3, 2026 / 06:10 AM IST

5, 6 తేదీల్లో ఆర్అండ్ బీ శాఖ మంత్రి జిల్లా పర్యటన

SKLM: జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో పర్యటించ నున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న సాయంత్రం 7.30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని బస చేస్తా రని పేర్కొన్నారు. 6న ఉదయం మూలపేట పోర్టుకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులు పరిశీలిస్తారని తెలిపారు.

April 3, 2026 / 06:09 AM IST

జిల్లాలో పెరిగిన మున్సిపల్ వార్డులు

ATP: జిల్లాలో పలు మున్సిపాలిటీల వార్డుల సంఖ్య పెరిగింది. గుంతకల్‌లో 37 వార్డుల నుంచి 48కి, తాడిపత్రి 36 నుంచి 48కి పెరిగాయి. రాయదుర్గంలో 32 నుంచి 40కి, గుత్తిలో 25 నుంచి 32కి వార్డుల సంఖ్య పెరిగింది. అలాగే కళ్యాణదుర్గంలో 24 నుంచి 32కి వార్డులను పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

April 3, 2026 / 06:06 AM IST

విద్యుత్ కాంతులతో కర్నూలు చారిత్రక కట్టడాలు

KRNL: ఉభయ సభల్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో గురువారం సాయంకాలం జిల్లాలోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో సైతం కార్యాలయానికి అధికారులు ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేశారు.

April 3, 2026 / 06:04 AM IST

నాణ్యత లోపంతో రహదారి విస్తరణ పనులు

AKP: పాయకరావుపేట పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి బాబి, పార్టీ నాయకులు ఆరోపించారు. గురువారం రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారన్నారు.

April 3, 2026 / 06:01 AM IST

ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ పరిశీలించిన సీఎం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ రూపొందించిన మాస్టర్ ప్లాన్ మ్యాప్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గురువారం టీటీడీ అతిధి గృహంలో ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్ శ్రీధర్, టీటీడీ JEO వీరబ్రహ్మం సీఎంకు వివరించారు.

April 3, 2026 / 06:01 AM IST

మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించడంలో కీలక పాత్ర పోషించిన PM నరేంద్రమోదీకి, మంత్రి నారా లోకేష్‌కి MP కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలుపుతు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని, ఈ బిల్లునకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

April 3, 2026 / 06:00 AM IST

నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

TPT: పంచాయతీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. రేపటి నుంచి తిరుపతి జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలన సాగనుంది. జిల్లాలో 811 పంచాయతీలు ఉండగా, 29 గ్రామ పంచాయతీలకు 2020న సాధారణ ఎన్నికల జరగకపోవడంతో ప్రత్యేకాధికారులు ఉన్నారు. మిగిలిన 782 గ్రామ పంచాయితీలకు 271 మంది అధికారులను ఇప్పటికే కలెక్టర్ నియమించారు.

April 3, 2026 / 06:00 AM IST