CTR: విజయపురం మండలం గొల్లపల్లిలో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ లక్ష్మీపతి రాజు దగ్గరుండి పర్యవేక్షించారు. పనుల నాణ్యతపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రాజు, జిల్లా TDP పార్టీ అధికార ప్రతినిధి ముని భాస్కర్ రాజు, రవిరాజు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
PPM: సీతానగరం మండలం పాపంవలస గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.
SS: పెనుకొండ పట్టణ సమీపంలోని గోనిపేట రోడ్డులో ఉన్న దర్గాకు సంబంధించిన పీఠాధిపతులు, కమిటీ సభ్యులు మంత్రి సవితను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న జరగనున్న వార్షిక గంధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ పెనుకొండలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.
KRNL: ఆదోనిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ నయీమ్‌కు వినతి పత్రం అందజేశారు.
KDP: ఒంటిమిట్ట మండలం గొల్లపల్లె, దర్జీపల్లెల్లో నిర్వహించిన ‘రైతన్న మీకోసం-ఇంటింటికి’ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులపై వివరాలు తెలుసుకుని, వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు.
ATP: గుత్తిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే గ్యాస్ ఏజెన్సీ వద్దకు సుమారు 400 మంది ఖాళీ గ్యాస్ సిలిండర్లతో క్యూ లైన్‌లో నిలబడ్డారు. మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు తలుపులు తెరవకపోవడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
E.G: రాజమండ్రిలోని 46వ డివిజన్ రామదాసుపేటలో ఉన్న మున్సిపల్ పాఠశాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పెట్టె ఆహారం విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదని హెచ్చరించారు.
E.G: రాజమండ్రిలోని 46వ డివిజన్ రామదాసుపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పెట్టె ఆహారం విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదని హెచ్చరించారు.
VZM: డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలియుగ దైవం, ప్రపంచ పవిత్ర పుణ్య క్షేత్రంలో బి ఆర్ నాయుడు లాంటి స్త్రీ లోలుడును ఛైర్మన్‌గా కోనసాగించడం తిరుమల పవిత్రతను దెబ్బ దీయడమే అని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీనువాసరావు పాల్గొన్నారు.
NDL: జిల్లాకు చెందిన నరేంద్ర (35) అనే రాడ్ బెండింగ్ కార్మికుడు గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుడి భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
CTR: రామకుప్పం మండలం పెద్దగానూరులో RYSS ఆధ్వర్యంలో నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. జీవామృతం, సహజ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతుల అనుభవాలు తెలుసుకొని, క్షేత్రాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
సత్యసాయి: తనకల్లు(మం) బాలసముద్రం పంచాయతీ గోవిందువారిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యకార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
TPT: సూళ్లూరుపేటలో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ మాఫీ ప్రకటించిందని మునిసిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు. ఈ మాఫీ 31 మార్చి 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుందన్నారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి వడ్డీ, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే బకాయిలు చెల్లించాలని సూచించారు.
ELR: ఉంగుటూరు మండల తల్లాపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లా నాగేంద్ర రావు ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను మంగళవారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించారు. 5 సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధన జరుగుతుందని ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి వివరించారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో రైతులకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐదు గ్రామాల చెరువులు, గుంటలకు నీరు ఇవ్వాలని కోరారు. సాగునీరు వచ్చే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు పిలుపునిచ్చారు.