• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లాలో 358 మంది విద్యార్థులు గైర్హాజరు

KRNL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 03:00 PM IST

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

KDP: జిల్లాలో గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులు పూర్తిగా అసత్యమని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా స్పష్టం చేశారు. జిల్లాలో గృహ అవసరాలకు తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందన్నారు.

March 17, 2026 / 03:00 PM IST

తాడేపల్లిగూడెంలో ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్

W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మున్సిపల్ సర్వేయర్, ఇంఛార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తూ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్, సిబ్బంది, కుటుంబీకులను విచారిస్తున్నారు.

March 17, 2026 / 03:00 PM IST

‘PRC కమిషన్ వేసి IR వెంటనే ప్రకటించాలి’

KKD: ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ వేసి IR వెంటనే ప్రకటించాలని PDF టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. పిఠాపురం మండలంలో పలు హై స్కూల్స్‌ను ఆయన సందర్శించి, టీచర్స్ ఇబ్బందులను తెలుసుకున్నారు. 2023 జూన్‌తో 11వ పీఆర్సీ ముగిసిపోగా, 12వ పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ టీచర్స్ నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

March 17, 2026 / 02:58 PM IST

రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్

ప్రకాశం: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో మంగళవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ గురించి రైతులకు వివరించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

March 17, 2026 / 02:55 PM IST

విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌లపై అవగాహన

బాపట్ల మండలం ముత్తాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “నో-గో-టెల్” విధానం గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

March 17, 2026 / 02:53 PM IST

నేతన్నల ఆరోగ్యానికి ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’

SS: నేతన్నల ఆరోగ్య రక్షణకు ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం ధర్మవరంలో నిర్వహించిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ధర్మవరం పట్టు చీరలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు.

March 17, 2026 / 02:49 PM IST

‘దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం’

ATP: రాష్ట్రంలో దివ్యాంగులకు రేపటి నుంచి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మంగళవారం తెలిపారు. పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని సర్వీసుల్లో ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం వీరికి భరోసా కల్పిస్తోందని ఆయన చెప్పారు.

March 17, 2026 / 02:48 PM IST

కొత్తూరు గ్రామంలో కాలి బిందెలతో నిరసన

KRNL: పెసలబండ వాటర్ స్కీం ద్వారా పది రోజులైనా త్రాగునీరు సరఫరా కావడం లేదని కొత్తూరు గ్రామంలో సీపీఎం, గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ఇవాళ నిరసన తెలియజేశారు. సీపీఎం శాఖ కార్యదర్శి కర్ణ, నాయకులు నాగరాజు మాట్లాడుతూ.. వేసవి కాలంలో పది రోజులైనా త్రాగునీళ్లు రావడంలేదని వెంటనే త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

March 17, 2026 / 02:40 PM IST

మంచినీటి ట్యాంకులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం రూరల్(మం) సాకుర్రులో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకులను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్, DY.CM పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల వెల్లువ కురుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 17, 2026 / 02:39 PM IST

ఉపాధి పనుల పట్ల కేంద్ర బృందం సంతృప్తి

VZM: గజపతినగరం మండలంలోని కెంగువలో జరుగుతున్న చెరువు పనులు, వేమలిలో వేసిన బీటీ రోడ్డు పనులను మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఆడిట్ అధికారులు పరిశీలించారు. జాబ్ కార్డులు ఈ కేవైసీ, పనులు వద్ద టెంట్లు వేయడం తదితర అంశాలలో అంకితభావంతో పనిచేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి ఏపీవో కళ్యాణి పాల్గొన్నారు.

March 17, 2026 / 02:39 PM IST

పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

E.G: నిడదవోలు(మం) డీ.ముప్పవరంలో ఉన్న ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యాసాన్ని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

March 17, 2026 / 02:37 PM IST

చిత్తూరులో కారుణ్య నియామక ఉత్తర్వుల పంపిణీ

CTR: చిత్తూరు జడ్పీ కార్యాలయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్మన్ జి. శ్రీనివాసులు @ వాసు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వి. రవికుమార్ నాయుడు పాల్గొన్నారు. కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియామకాలు కల్పిస్తోందని ఆయన తెలిపారు.

March 17, 2026 / 02:31 PM IST

బ్రెయిన్ డెడ్‌లో రచయిత ఎల్లారెడ్డి మృతి

KDP: జిల్లాకు చెందిన రచయిత, విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు బాల ఎల్లారెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించారు. వారి పార్థివదేహాన్ని మంగళవారం సాయంత్రం ఆరు గంటల తరువాత కడపలో ఓంశాంతిలోని స్వగృహానికి తీసుకువస్తారు. బుధవారం తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాల ఎల్లారెడ్డి మరణానికి వివిధ వర్గాల ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.

March 17, 2026 / 02:31 PM IST

రాజంపేటలో 6 బైకులు దగ్ధం

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో సోమవారం రాత్రి 6 బైకులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని బైక్ మెకానిక్ అమీర్ తెలిపారు. ఈ ఘటన నూనెవారిపల్లి రోడ్డులో టెలిఫోన్ కార్యాలయం ఎదురుగా జరిగింది. తన వద్దకు రిపేరుకు వచ్చిన బైకులను రాత్రి సమయంలో షాపు సమీపంలో బయట ఉంచగా.. నిప్పు పెట్టి కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలన్నారు.

March 17, 2026 / 02:30 PM IST