PPM: జిల్లాలో మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ విమల పాలకొండలో రైతు సంఘం నాయకుడు బుడితి అప్పలనాయుడిని శనివారం కలసి సమస్య పరిష్కారంపై చర్యలు వివరించారు.