W.G: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఏప్రిల్ 1వ తేదీన విస్తృత స్థాయిలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల విలువైన సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.