KDP: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ ప్రక్రియలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సాయిప్రసాద్, జయలక్ష్మితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు.