TPT: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ B.R.అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు.