GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. కావున ఆసక్తి గల వారు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.