E.G: ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో 235 మంది లైసెన్సు సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు కాకినాడ జిల్లా సర్వే & భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.