అన్నమయ్య జిల్లాలో చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. రీ సర్వే పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలను జీరో ఎర్రర్స్తో జారీ చేయాలని సూచించారు.అలాగే జలధార–జలహారతి కింద 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి వర్షపు చుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.