TG: మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ ఎగ్జిట్-6 దగ్గర ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని విమర్శించారు. బీఆర్ఎస్ సభలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదన్నారు.