కృష్ణా: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్వగృహంలో ఆయన భౌతికకాయానికి గుడివాడ జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గురువారం నివాళులర్పించారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ని శ్రీకాంత్ కలిసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నాయకుడని, ఆయన మరణం తీరనిలోటని తెలిపారు.