ATP: రాయదుర్గం రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. శారదా దేవి ట్రస్ట్ నిర్వాహకులు స్వామి అర్చనానంద దీనిని ప్రారంభించి, తొలిరోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.