కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన నాగలక్ష్మి ఖతార్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కేసీఎం అధికారులు ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. ఫిబ్రవరి నెలలో ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఆమెను అక్కడ తోటి పనిమనిషి వేధించినట్లు నాగలక్ష్మి ఆరోపించింది. దీంతో అధికారులు ఏజెంట్‌తో మాట్లాడి ఆమెను గురువారం స్వదేశానికి రప్పించారు.