NDL: కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఇవాళ పెద్దమ్మ తల్లి అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించారు. అమ్మవారికి బోనాలను సమర్పించిన అనంతరం మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.