VZM: జిల్లాలో నిర్వహిస్తున్న “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా చీపురుపల్లి సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు కార్టెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డీఎస్పీ ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాడ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 125 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి 10 బైకులు సీజ్ చేశారు.