KDP: YVUలో AP స్కిల్ డెవలప్మెంట్,YVU ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించి, విద్యార్థులు ప్రారంభ వేతనం కంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నిరంతర అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మేళాకు 332 మంది హాజరుకాగా, హెటెరో ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి కంపెనీలు 57 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి.