ELR: గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల అభివృద్ధి జరుగుతుందని, భూములిస్తే నేడు అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్నాయని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఊరి పొలాల్లో వెలసిన టోల్ ప్లాజాలో జరిగే నియామకాల్లో కనీసం 50% ఉద్యోగాలను పుట్లగట్లగూడెం యువకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టోల్ సూపర్వైజర్కు వినతి పత్రం అందజేశారు.