ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ సెక్రెటరీగా మార్కాపురానికి చెందిన పీవీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన మార్కాపురం ఇంఛార్జి అన్నా రాంబాబుకు, వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత తనపై మరింత బాధ్యతను పెంచిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.