AKP: రాంబిల్లి మండలంలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేపట్టనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ శంకుస్థాపనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అచ్యుతాపురంలో కూటమి నేతలతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారు 15 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.