VSP: విశాఖకు చెందిన ధర్మాల మాధవరావు(57) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కాగా, ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆయన నుంచి సేకరించిన లివర్, కిడ్నీ, రెండు కళ్ళతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ కో- ఆర్డినేటర్ డా. రాంబాబు సోమవారం ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను అభినందించారు.