CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, జేకేసీ విభాగం సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నాయన్నారు. 20 బహుళ జాతీ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.