KRNL: ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తామని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మంత్రాలయం మండలం చిలకలడోణ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఇవాళ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని డాక్టర్లకు సూచించారు.