PLD: పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా తన జనగణన వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. శుక్రవారం se.census.gov.in వెబ్సైట్ ద్వారా స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) పూర్తి చేశారు. ఇందులో 33 ప్రశ్నలకు వివరాలు అందించారు. ఈ నెల 30 వరకు ప్రజలు తమ ఇళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.