NDL: డోన్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సీపీఐ సీనియర్ కార్యకర్త కొత్తపల్లి మాసూం భాష కుటుంబానికి ఆ పార్టీ నేతలు అండగా నిలిచారు. గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు నేతృత్వంలో రూ.50 వేల నగదు, 100 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి కౌన్సిల్ సభ్యులు సాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.